AP: జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. పార్వతీపురం పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'మహానాడులో 6 శాసనాలను ప్రకటించాం. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజినీరింగ్, అన్నదాతకు అండగా శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' అని సూచించారు. ప్రాంతాలు, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.