అమరావతికి కేంద్రం శుభవార్త?

65చూసినవారు
అమరావతికి కేంద్రం శుభవార్త?
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 189 కి.మీ. ఓఆర్ఆర్‌కు రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ సారి బడ్జెట్‌లో రూ.5-10 వేల కోట్లు కేటాయించనున్నారు. భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ఓఆర్ఆర్‌ను 6 లేన్లతో ఎక్స్‌ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు.

సంబంధిత పోస్ట్