ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉద్యానవన పంటలకు బీమా పథకంపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మామిడి రైతులకు సంబంధించి 2024-25, 2025-26 రబీ సీజన్లలో బీమా పథకం అమలు చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. జిల్లాల వారీగా హెక్టారుకు బీమా మొత్తాన్ని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా బీమా వర్తింపు కోసం పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.