AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గుడ్ న్యూస్ చెప్పారు. 2025-26లో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసగించారు. ఈ క్రమంలోనే ఆయన కరెంట్ ఛార్జీల పెంపుపై ప్రకటన చేశారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు.