AP: రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 20న ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయనుంది. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి.. రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు, రెండో విడతలో రూ.7 వేలు, మూడో విడతలో రూ.6 వేలు జమ చేయనుంది.