ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో QR కోడ్‌తో టికెట్స్ కొనుక్కునే అవకాశం!

82చూసినవారు
ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో QR కోడ్‌తో టికెట్స్ కొనుక్కునే అవకాశం!
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలు కౌంటర్ వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను విక్రయించే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా చిల్లర కష్టాలకు పూర్తిస్థాయిలో చెక్ పడనుంది. ఇప్పటివరకు ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఈ వ్యవస్థ ఉండగా.. ఇకపై అన్ని స్టేషన్లలో కొత్త సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. దీంతో టికెట్ల కొనుగోలు మరింత సులభతరం కానుంది.

సంబంధిత పోస్ట్