పేదలకు గుడ్ న్యూస్.. ఉచితంగా ఇళ్లు, కొత్త పాస్‌బుక్‌లు

5చూసినవారు
పేదలకు గుడ్ న్యూస్.. ఉచితంగా ఇళ్లు, కొత్త పాస్‌బుక్‌లు
AP: పేదలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రత్యేక ఉపసమితిని నియమించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అభ్యంతరం లేని స్థలాల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియను డిసెంబర్‌ లోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్‌ నాటికి ‘రీ-సర్వే 2.0’ను పూర్తి చేయాలని తెలిపారు. అలాగే రీసర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారుల పాస్‌బుక్‌లు ఆగస్టులో అందించాలన్నారు. మొత్తం 21.86 లక్షల మందికి మొదటి విడతలో పాస్‌బుక్‌లు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

సంబంధిత పోస్ట్