AP: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో 18 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోందట. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయడానికి ఇప్పటికే ఖాళీలను కూడా గుర్తించినట్లు సమాచారం. తాజాగా ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు చేయడంతో నెల రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. కాగా ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.