ఏపీలోని ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్

85చూసినవారు
ఏపీలోని ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. వర్సిటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం వీరి రిటైర్‌మెంట్ వయసు 60 ఏళ్లు కాగా.. దీనిని 62 ఏళ్లకు పెంచాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై సీఎం ఇటీవల సమీక్ష జరిపారు. ఈ సందర్భంగానే వర్సిటీ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపు ప్రస్తావన వచ్చింది. దీంతో రెండేళ్లు పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు.

ట్యాగ్స్ :