ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను విడుదల చేసింది. 2024-25కు గానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్రంలోని 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు కేటాయించనున్నారు.