AP: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు నిలిపివేసే ఘటనల జరగకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. వాట్సాప్ ద్వారానే ఇంటర్ హాల్ టికెట్లు అందించనుంది. 95523 00009 నంబర్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇదే అవకాశాన్ని కల్పించాలని భావిస్తోంది.