AP: పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే ప్రభుత్వం 80% శాతం రాయితీ అందిస్తుందని పేర్కొంది. ఈ బీమా మూడేళ్లు ఉంటుంది. 384 రైతు చెల్లిస్తే మూడేళ్ళ పాటు వర్తిస్తుంది. దీంతో పశువులు అకాల మరణం చెందితే రూ.30 వేల రూపాయలు బీమా పొందొచ్చు. గొర్రెలు, మేకలకు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే రూ.6000 రూపాయలు బీమా లభిస్తుంది. ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణా అందించడం జరుగుతుందని పేర్కొంది.