గుడ్‌న్యూస్.. ఈ నెల చివరిలో సచివాలయ ఉద్యోగుల బదిలీలు

61చూసినవారు
గుడ్‌న్యూస్.. ఈ నెల చివరిలో సచివాలయ ఉద్యోగుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బదిలీలను 2025 జూన్ చివర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. మే 31 నాటికి ఐదేళ్లు ఒకే చోట పని చేసినవారికి తప్పనిసరిగా బదిలీ ఉంటుందని, సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే దగ్గర్లోని సచివాలయాల్లో అవకాశం కల్పిస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్