స్టార్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కారుకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ గూడ్స్ ఆటో ఢీ కొట్టింది. దీంతో కారు కొంచెం డ్యామేజ్ కావడంతో ద్రావిడ్ రోడ్డుపై ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. చిన్న ప్రమాదమే కావడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.