AP: వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో అనర్హులకు పెద్దమొత్తంలో ఇళ్ల పట్టాలు కట్టబెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా లేఅవుట్లలో అనర్హులకు కేటాయించిన స్థలాలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ కార్యకర్త అయితే అర్హత లేకపోయినా పట్టాలు మంజూరు చేశారంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారిస్తే అనర్హులు బయటపడతాయని టీడీపీ నేతలు అంటున్నారు.