గిరిజన ప్రాంతాల్లోని మల్టీపర్పస్‌ సెంటర్లకు ప్రభుత్వం శుభవార్త

73చూసినవారు
గిరిజన ప్రాంతాల్లోని మల్టీపర్పస్‌ సెంటర్లకు ప్రభుత్వం శుభవార్త
ఏపీలోని కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 72 మల్టీపర్పస్‌ సెంటర్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.43.20 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం లేనిచోట వీటిని నిర్మించనున్నారు. కేంద్రం ఇప్పటికే 125 కేంద్రాలు రాష్ట్రానికి మంజూరు చేయగా అందులో తొలి విడతగా 72 కేంద్రాల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి.

సంబంధిత పోస్ట్