ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. గత నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన జీవోను తెలుగు భాషలో విడుదల చేశారు. మొదటగా ఇంగ్లీష్‌లో జీవో విడుదల కానుండగా.. రెండు రోజుల్లోపు అదే జీవో తెలుగులో జారీ చేస్తారు.