AP: మెగా డీఎస్సీ-2025 పై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటిపేరుతోనే అప్లికేషన్ నింపాలని అధికారులు తెలిపారు. ఒక అప్లికేషన్‌లోనే తమ అర్హతలను బట్టి అభ్యర్థులు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.