నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

60చూసినవారు
నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
AP: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉ.10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సూపర్ సిక్స్ పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలను పెన్‌డ్రైవ్‌లో సభ్యులతో పాటు మీడియాకు ఇవ్వనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్