AP: రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్ కి.మీ. ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాయలసీమ జిల్లాల్లోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగపడుతుందని అంచనా. ఇప్పుడు ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్‌వర్క్ పరిమితి మించడంతో గ్రీన్ కారిడార్ తప్పనిసరి అని భావిస్తోంది. రూ.17 వేల కోట్లతో కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.