ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ సమావేశాల సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సీఎం పేరును తప్పుగా పలికారు. సీఎం నారా చంద్రబాబు పేరును.. 'నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు' అని తప్పుగా పలికారు. బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి కిందట ప్రారంభం కాగా, గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయసభలు వాయిదా పడనున్నాయి.