ఏపీలోని పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ యజమానులు నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు చేసుకోవచ్చు. కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.