మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం తన తాత, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులు, మహిళలకు పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. అలాగే మహిళా సాధికారితపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.