మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మనోరా మార్కెట్ కమిటీకి తీసుకువచ్చిన వేరుశనగ పంట భారీ వర్షానికి కొట్టుకుపోయింది. అయితే రైతులు పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ తీసుకురాగా.. అకాల వర్షాలకు వరదనీటిలో కొట్టుకుపోయింది. దానిని కాపాడడానికి ఓ రైతు ఎంతో ప్రయత్నించాడు. కానీ పంట నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.