కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐ శిరీషపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ‘బాధలో ఉన్న విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇలాంటి పోకడలు సహించేది లేదు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలి. దురుసుగా ప్రవర్తించవద్దు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఎస్ఐ శిరీష్ నుంచి వివరణ తీసుకుని, ఆమెను సస్పెండ్ చేశారు.