గుల్జార్, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌ పురస్కారం ప్రదానం

57చూసినవారు
గుల్జార్, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023వ సంవత్సరానికి గానూ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత గుల్జార్‌కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు శుక్రవారం అందజేశారు. హిందీ చిత్రసీమలో గుల్జార్‌ గొప్ప గేయ రచయితగా, ఉర్దూ కవిగా విశేషంగా గుర్తింపు పొందారు. 75 ఏళ్ల రామభద్రాచార్య చిత్రకూట్‌లో తులసీ పీఠ్ వ్యవస్థాపకుడిగా, హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడిగా ప్రసిద్ధి చెందారు.

సంబంధిత పోస్ట్