గన్ మిస్‌ఫైర్.. కర్ణాటక కాంగ్రెస్ నేతకు గాయాలు

61చూసినవారు
గన్ మిస్‌ఫైర్.. కర్ణాటక కాంగ్రెస్ నేతకు గాయాలు
కర్ణాటకకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత, INTUC నాయకుడు చిత్తరంజన్ శెట్టికి బుల్లెట్ గాయాలయ్యాయి. చిత్తరంజన్ తన వ్యక్తిగత భద్రత కోసం ఉంచుకున్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ఆయన గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాణ హాని ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్