బాపట్ల జమేదార్ పేటలో సప్తస్వర సంగీత కళాశాలను స్థాపించి శాస్త్రీయ సంగీత ప్రచారం కోసం అహర్నిశలు పరితపించిన విదుషీమణి కోటి రాజ్(88) అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ కొనియాడారు. బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ఆదివారం కోటిరాజ్ సంతాప సభ నిర్వహించారు. ఎందరో సంగీతాభిలాషులకు కోటి రాజ్ ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చారని అన్నారు. వారి మృతి సంగీత ప్రపంచానికి బాధాకరమన్నారు.