అవయవదానంతో అమరత్వం పొందవచ్చని, ఎందరో జీవితాలలో వెలుగులు నింపవచ్చని బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ అన్నారు. శనివారం 'అవయవదానం'పై ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అవయవదాతల కోసం దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారన్నారు. అవయవదానంపై అపోహలు వీడి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.