క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి పేర్కొన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నుంచి అవగాహన ర్యాలీని అయన ప్రారంభించారు. క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు.