కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు కేవలం లంబాడీలు, ఎరుకుల,సుగాలీలు ఈ మూడు ఉప కులాలు మాత్రమే గిరిజన ఫలాలు అందుకుంటున్నాయి తప్ప మిగతా గిరిజన జాతులు సంక్షేమ ఫలాలు అందుకోవడంలో పూర్తిగా వెనకబడిపోయాయని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటగిరి సంజీవరావు
అన్నారు. ఈ మేరకు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత ఆర్గనైజర్ గంధళ్ళ నరేష్, పొట్లూరి శ్రీను పాల్గొన్నారు.