బాపట్ల పట్టణంలో తిరుగుతున్న ఆవులను జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరలో ఉన్న హిందూ స్మశానవాటికకు తరలించారు. సరైన పోషణ లేకపోవడంతో ఇప్పటివరకు 12 ఆవులు చనిపోయాయని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ట్రెజరర్ యజ్ఞం పత్తులు సురేష్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఆవులు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం దాతల సహాయంతో 10 ఎకరాల గడ్డి, 10 బస్తాలు తొవ్వలను గోవుల కోసం అందజేశారు.