బాపట్ల: కర్లపాలెంలో తిరంగా ర్యాలీ

77చూసినవారు
బాపట్ల: కర్లపాలెంలో తిరంగా ర్యాలీ
జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులను అణచివేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా, భారత జవాన్లను అభినందిస్తూ కర్లపాలెం మండల పరిషత్ ఆధ్వర్యంలో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్‌లో అమరుడైన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్కల లలిత కుమారి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి, ఈఓఆర్డి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్