విలువైన ఫ్యాన్సీ ఐటమ్స్ ను గుట్టుచప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న ముగ్గురు మహిళలను ఈపురుపాలెం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. AP09BF5296 కారులో బాపట్ల వైపుకు తరలిస్తున్న దీపారాధన సామాగ్రి, లేడీస్ టాప్స్, ఐరెన్ బాక్స్ లు, రోల్డ్ గోల్డ్ ఐటమ్స్, ఇత్తడి వస్తువులను ఎస్సై చంద్రశేఖర్ గుర్తించారు. ఆ వస్తువులకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో వాటిని దొంగ వస్తువులుగా భావించి కారును సీజ్ చేసి ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు.