బాపట్ల పురపాలక సంఘం పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ వార్డ్ క్రిస్టియన్ పేట్, రామకృష్ణాపురం నందు మునిసిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జనావాసాల మధ్య ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లు గమనిస్తే ఆయిల్‌బాల్స్ వేయాలని, పిచికారి మందు వేయించాలని సిబ్బందికి సూచించారు.