బాపట్ల పట్టణంలో ఆదివారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండా దిమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ జెండాలు, నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.