ఫిబ్రవరి 1న జరిగిన రాష్ట్రస్థాయి బాల మహోత్సవము మరియు క్రీడలు వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో జరిగింది. ఈ పోటీలలో స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్ 14, అండర్ 17 ఖో-ఖో బాలుర విభాగాలలో రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మంగళవారం సర్టిఫికెట్లు, మెడల్లు, కప్పులు హెచ్ అనంత శివా అందజేశారు.