కర్లపాలెం మండలంలోని శ్రీ గంగా గౌరీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దీక్షపరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి చద్ది కార్యక్రమం నిర్వహించారు. వివిధ మాలలు ధరించిన భక్తులు స్వామివారికి అర్చనలు చేసి దైవ ప్రసాదం స్వీకరించారు. భక్తుల సమాకూరుతో ఆలయం భక్తిమయంగా మారింది.