కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయిస్ రిక్రియేషన్ క్లబ్ లో మంగళవారం కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కూటమి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గెలుపు కోసం డోర్ టూ డోర్ క్యాంపైన్ చేయాలన్నారు. ప్రతి ఓటరును కలసి ప్రభుత్వ విజయాలను తెలియజేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని వివరించారు.