బాపట్ల రోటరీ క్లబ్ వద్ద ఆదివారం జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. రాబోయే వేసవి దృష్ట్యా ఆరోగ్య సంరక్షణపై సూచనలు ఇచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని సూచించారు.