నిజాంపట్నం మండలంలో పూరిళ్లు దగ్ధం

63చూసినవారు
నిజాంపట్నం మండలంలో పూరిళ్లు దగ్ధం
నిజాంపట్నం మండలం కొమరవోలు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎస్సీ కుటుంబాలకు చెందిన 3 పూరిళ్లు దగ్దమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మూడు ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఇళ్లలోని సామాగ్రి దగ్దమైంది. సంఘటన స్థలాన్ని నిజాంపట్నం జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం నుండి రాయితీలు వచ్చేలా చేస్తామని హమీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్