అమరావతి మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్, క్రోసూరు రోడ్డు సెంటర్ లో దివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్ఐ రాజశేఖర్ వాహనాల తనిఖీ చేపట్టి వాహన దారులకు పలు చూచనలు ఇచ్చారు. సరైన పత్రాలు కలిగి ఉండాలని వాహనదారులను హెచ్చరించారు. ప్రమాదాలను నివారించేందుకు, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వరాదని ఎస్ఐ రాజశేఖర్ హెచ్చరించారు.