చిలకలూరిపేటలో బైక్ ల దొంగ అరెస్ట్

80చూసినవారు
చిలకలూరిపేటలో బైక్ ల దొంగ అరెస్ట్
చిలకలూరిపేట తూర్పు క్రిష్టియన్ పేటకు చెందిన గట్టుపల్లి ప్రదీప్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడు చెడు అలవాట్లకు బానిసై డబ్బు కోసం గుంటూరులో బైక్ దొంగతనాలకు పాల్పడేవాడు. దీంతో పోలీసులు నిఘా ఉంచి శుక్రవారం చిలకలూరిపేట రోడ్డు వై జంక్షన్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి 8 స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్