చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన ఆదివారం పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎమ్మెల్సీ గా అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి ను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.