చిలకలూరిపేట: ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి

74చూసినవారు
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ చిలకలూరిపేట నియోజకవర్గ సమావేశం టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. పుల్లారావు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీమంత్రి పుల్లారావు కోరారు.

సంబంధిత పోస్ట్