చిలకలూరిపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ. ప్రైవేట్ పాఠశాలలకు తగినట్లుగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందని తెలిపారు.