చిలకలూరిపేట: మిర్చి రైతులని కేంద్రం తక్షణమే ఆదుకోవాలి

77చూసినవారు
చిలకలూరిపేట: మిర్చి రైతులని కేంద్రం తక్షణమే ఆదుకోవాలి
రాష్ట్రంలో విస్తృతంగా సాగయ్యే వాణిజ్య పంటలను, సాగుదారులని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. బుధవారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సాగు విధానాలపై దేశంలోని మిర్చి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాపారుల మాయాజాలం మార్కెట్ హెచ్చుతగ్గుల కట్టడికి ప్రత్యేక చట్టాలతో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్