మాజీ మంత్రి విడదల రజినీ మరిది విడదల గోపీకి ఏసీబీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఎడ్లపాడు క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విడదల గోపీ చిలకలూరిపేట లో అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. అతనికి బెయిల్ రావడంతో చిలకలూరిపేటకు చేరుకున్నారు.