చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల, కావూరు గ్రామాలలో కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం పర్యటించారు. గ్రామంలో చెత్త సంపద కేంద్రాలను పరిశీలించారు. ప్రతిరోజు గ్రామంలో ఎంత మేరకు వ్యర్థాలను స్వీకరిస్తారో అడిగి తెలుసుకున్నారు. తయారు చేస్తున్న వర్మీ కంపోస్టును కొనుగోలు దారులకు ఏ ధరకు విక్రయిస్తున్నారో వివరాలు తీసుకున్నారు. గ్రామాలలో జరుగుతున్న రీసర్వే గురించి ఆరా తీశారు. ఆర్డీవో మధులత ఉన్నారు.