నరసరావుపేటలో వీధి కుక్కలతో భయం.. భయం

85చూసినవారు
నరసరావుపేట పట్టణంలోని బరంపేట, పాతూరు తదితర ప్రాంతాల్లో శుక్రవారం కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారినీ వెంబడిస్తున్నాయి. తక్షణమే సంబంధిత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్